Homeజిల్లా వార్తలుకడెం ప్రాజెక్టు నీటి విడుదల.. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ధర్మపురి సీఐ

కడెం ప్రాజెక్టు నీటి విడుదల.. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ధర్మపురి సీఐ

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పోలీస్, రెవెన్యూ అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు తెలియజేయడమైనది ఏమనగా పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడినందున 30 వేల క్యూసెక్కుల నీరు కడెం ప్రాజెక్టు వస్తుందని అంచనాతో ఈ రోజు (30.08.2024 ) రాత్రి 4.00 గంటల నుండి కడెం ప్రాజెక్ట్ గేట్లను తెరిచి నీటిని కిందికి వదలడం జరుగుతుంది. కావున నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువన) పశువులు గాని, గొర్రెలు గాని, మొదలగునవి వెళ్లకుండా అలాగే పల్లెకారులు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ధర్మపురి సీఐ రామ నర్సింహారెడ్డి, ఎస్సై మహేష్ తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img