చందమామ కాజల్ అగర్వాల్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన కాజల్ ఆ తర్వాత చందమామ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కాజల్‌కి కెరీర్‌లో సినిమాల పరంగా చిన్న బ్రేక్ కూడా రాలేదు.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంటోంది. ఒకవైపు యంగ్ హీరోలతో జత కడుతూనే మరొక వైపు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోలతోనూ నటించే అవకాశం అందుకుంటోంది.
ఈక్రమంలోనే తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గత నెలలో నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రారంభం అయింది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో సాగుతోంది. కాగా తాజాగా ఈ షెడ్యూ్‌లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయిందట.
ఇక ఈ సినిమాని నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య, హిందీలో ముంబై సాగా సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది.
ఇక మంచు విష్ణుతో కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Kajal Agarwal gets the chance to star in the latest film starring Akkineni Nagarjuna.
Director Praveen Sattaru recently revealed this on Twitter.
The action entertainer in Nagarjuna – Praveen Sattaru combination started last month.
The film is currently being shot in Goa. Recently, Kajal Agarwal joined the schedule.
The film will be shot non-stop and will be released this year.
Currently Kajal Agarwal is doing Acharya, Mumbai Saga movies in Hindi as well as a few other movies and web series.
The Pan Indian movie scammers starring Manchu Vishnu are coming to the forefront in a few more hours.