మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కనప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పార్వతి దేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. కాజల్ అగర్వాల్ పాత్రని పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 25 ఏప్రిల్ 2025న విడుదల కానుంది.