Homeసినిమాఏ బట్టలు వేసుకోవాలో మాకు తెలుసు: కాజల్

ఏ బట్టలు వేసుకోవాలో మాకు తెలుసు: కాజల్

హైద‌రాబాద్ః ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకోవాలో అమ్మాయిల‌కు తెలుస‌ని, ఈ విష‌యంలో ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేద‌ని సినీ న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు. బెంగుళూరులో దాడికి గురైనా సంయుక్తా హెగ్డేకు మ‌ద్ద‌తుగా ఆమే ట్విట్ చేశారు. “ఓ మై గాడ్… సామ్! ఇలా జరిగిందంటే నేను నమ్మడం లేదు. కవితా రెడ్డి మీ కోపానికి కారణాలు ఏమిటనేది తెలుసుకుని పరిష్కరించుకోవాలి. మీ దూకుడు, ద్వేష స్వభావానికి మూలాలు తెలుసుకోవాలి. ఏ బట్టలు వేసుకోవాలని అమ్మాయిలకు బాగా తెలుసు, ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలంటూ” ట్విట‌ర్ వేదిక‌గా కాజల్ హితవు పలికింది.
బెంగళూరు లోని ఒక పార్కులో కన్నడ నటి సంయుక్తా హెగ్డే స్పోర్ట్స్ బ్రా వేసుకుని వ్యాయామానికి రాగా.. ప్రజలు తిరిగే ప్రాంతంలో స్పోర్ట్స్ బ్రా వేసుకుని వస్తావా.. అంటూ కవితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతోపాటు సంయుక్త ఆమే స్నేహితురాలిపై చేయి చేసుకున్నది. దాడి వీడియోల‌ను హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోల‌పై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img