నటి కాజల్ పసుపతి తమిళ నటి. ఈమె తెలుగు ప్రజలకు అంతగా తెలియకపోయిన.. తమిళంలో మాత్రం సుపరిచితమే. కోలీవుడ్ లో మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ పసుపతి తెలుగులో అల్లు శిరీష్ డెబ్యూ సినిమా ‘గౌరవం’ లో కీలక పాత్రలో నటించింది. తర్వాత 2008లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన శాండీ మాస్టర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొంత కాలం సాఫీగానే సాగిన వీరి వివాహ జీవతంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటుచేసుకోగా.. 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
విడాకుల అనంతరం శాండీ మరో అమ్మాయిని వివాహం చేసుకోగా.. కాజల్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు. కానీ, తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా’ అంటూ పెళ్లి బట్టల్లో ఉన్న ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. కానీ, భర్తను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్ నిజంగా రెండో పెళ్లి చేసుకుందా..? లేక ఏదైనా మూవీ స్టంటా..? అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.