Homeహైదరాబాద్latest Newsకాళేశ్వరం కమిషన్ వద్దకు కీలక ఆధారాలు.. కుంగుబాటుకు అదే కారణమా..?

కాళేశ్వరం కమిషన్ వద్దకు కీలక ఆధారాలు.. కుంగుబాటుకు అదే కారణమా..?

విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై విచారణ సాగింది. కాళేశ్వరం డీపీఆర్‌ను అప్పటి సీఎం కేసీఆర్‌ ఆమోదించినట్లు వెంకటేశ్వర్లు కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా? మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ ఆదేశించారని వెంకటేశ్వర్లు బదులిచ్చినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img