నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుండి తాజాగా అమితాబ్ బచ్చన్‌పై ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అమితాబ్ అశ్వథామగా కనిపించనున్నారు. బిగ్ బీపై డిజైన్ చేసిన ఈ పోస్టర్ స్టన్నింగ్‌గా ఉందని చెప్పాలి. ఇక జూన్ 10న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. మరి ఆయన పై డిజైన్ చేసిన ఈ పోస్టర్ స్టన్నింగ్ గా ఉందనే చెప్పాలి. అమితాబ్ లుక్ అదిరిపోగా.. ఈ పోస్టర్ యాక్షన్ సీన్ నుంచి కట్ చేసినట్లు తెలుస్తోంది.