Homeహైదరాబాద్latest NewsKalki 2898 AD Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ

Kalki 2898 AD Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ

“కల్కి 2898 ఏడీ”.. ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. టీజర్, ట్రైలర్ తో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో సినిమాకి ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోనుందో తెలుసుకుందాం..

కథ:
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కథ మహాభారతంలోని ధర్మరాజు ఆడిన అబద్ధం నుంచి ప్రారంభమవుతుంది. కురుక్షేత్రంలో కృష్ణుడి నుంచి శాపం పొందిన అశ్వత్థామ, కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కల్కి సుమతి అనే మహిళ కడుపున జన్మించబోతున్నారని తెలిసి అశ్వత్థామ ఆ సుమతికి రక్షకుడిగా నిలుస్తారు. కాంప్లెక్స్ అనే మరో ప్రపంచంలోకి వెళ్లడానికి ఒక మిలియన్ యూనిట్ల కోసం వెతుకుతున్న భైరవకు సుమతిని కనుక తీసుకువస్తే ఆ యూనిట్లు తనకు దక్కుతాయి. మరి బైరవ అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చారా? సుప్రీం యస్కిన్ ఎవరు? మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో ఈ కలియుగ అంతం ఎలా ముడిపడి ఉంది అనే ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలోని పాత్రలకు సరైన నటీనటులను ఎంపిక చేశారని చెప్పాలి. ఇక ప్రభాస్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు ఈ సినిమాలో తెరపై ప్రభాస్ తనలో ఉన్న మరో నటన నైపుణ్యాన్ని బయటపెట్టారు. ఇక దీపిక పదుకొనే తన పాత్రకు 100% నయం చేసారు. ఇక కమల్ హాసన్, అమితాబ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో దుల్కర్ విజయ్ దేవరకొండ పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

టెక్నికల్:
ఈ సినిమా చూస్తే రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ ఈ సినిమా తీశాడు అంటే ఎవరు నమ్మరు. ఆయన విజినరీకి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ టేకింగ్, ప్రజెంటేషన్ చూస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఇలా రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ కు అశ్వినీ దత్ స్వయాన మామ అయినప్పటికీ ఆయనను నమ్మి 600 కోట్లు బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాత డేర్ చేశారనే చెప్పాలి. సంతోష్ నారాయణ మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి విభాగం 100కు 100% పని చేసే సినిమాని విజయవంతం చేశారు.

విశ్లేషణ:
‘కల్కి 2898 ఏడీ’ సినిమా లాంటివి మనం ఇదివరకు హాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే చూసి ఉంటాము అలాంటిది ఈ సినిమా మన భారతీయ సినిమా అది తెలుగు తెరపై చూడటం అంటే ప్రేక్షకులకు కాస్త అయోమయంగా ఉంటుంది. ఫస్ట్ కొద్ది నిమిషాల పాటు కథ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ నుంచి నాగ్ అశ్విన్ ప్రేక్షకులను చూపు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశారు.సెకండ్ ఆఫ్ తర్వాత ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కురుక్షేత్రం సినిమాకి హైలైట్ గా నిలిచింది మొత్తానికి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశారని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్:
నాగ్ అశ్విన్, కథ స్క్రీన్ ప్లే, హాలీవుడ్ విజువల్స్, ప్రభాస్, అమితాబ్, కమల్, కురుక్షేత్రం సీన్స్.

మైనస్ పాయింట్స్:
మొదటి 40 నిమిషాలు కథ స్లోగా సాగడం, దీపికా పదుకొనే డబ్బింగ్, ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ కాకపోవడం.

చివరిగా..
క‌ల్కి 2898 ఏడీ విజువ‌ల్ వండ‌ర్ మూవీ. హాలీవుడ్ సినిమాల‌కు మ‌రిపించే స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచుతుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిని మెప్పిస్తుంది.

రేటింగ్: 3.25/5

Recent

- Advertisment -spot_img