ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ టికెట్ ధరలు ముంబైలో ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.