దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వచ్చిన మూవీ ‘కల్కి 2898 AD’ కలెక్షన్ల సునామీని కొనసాగిస్తోంది. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ నాలుగో స్థానానికి చేరింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 40 రోజుల్లో రూ.640.6 కోట్లు వసూలు చేసి షారుఖ్ ఖాన్ ‘జవాన్'(రూ.640.25) లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. బాహుబలి–2 (1030.42), కేజీఎఫ్-2 (859.7), RRR (రూ.782.2) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.