ఇదే నిజం, ముస్తాబాద్: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో భాషా దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ ఆధ్వర్యంలో కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ సునీత మంజుల వినూత మురళి రాజు విజయ్ కుమార్ రాజేశ్వరరావు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.