Homeహైదరాబాద్latest NewsKalyan Ram : కళ్యాణ్ రామ్ - విజయశాంతి మూవీ టీజర్ ఎలా ఉందంటే..?

Kalyan Ram : కళ్యాణ్ రామ్ – విజయశాంతి మూవీ టీజర్ ఎలా ఉందంటే..?

Kalyan Ram : ”బింబిసారా” లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ”డెవిల్” అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న.. కానీ అనుకుంతా విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో ఒక్కపుడు హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఆమె కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ టీజర్ చూస్తుంటే ముఖ్యంగా విజయశాంతి ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు.. ఎందుకంటే ఆమె గతంలో చాలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించారు. కానీ ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటించిన ”కర్తవ్యం” సినిమా మాత్రం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలోనే విజయశాంతి నటించింది. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి మరోసారి తనదేనా నటనతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక హీరో కళ్యణ్ రామ్ అయితే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img