Homeహైదరాబాద్latest NewsKalyan Ram : కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ వర్కవుట్ అవుతుందా..?

Kalyan Ram : కళ్యాణ్ రామ్ కాన్ఫిడెన్స్ వర్కవుట్ అవుతుందా..?

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చాలా సినిమాలు చేసాడు కాని అనుకుంతా స్థాయికి వెళ్లలేదు. ఇంకా మిడ్ రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న సరైన హిట్టు పడడం లేదు. అప్పుడు అప్పుడు ”పటాస్”, ”బింబిసారా” వంటి సినిమాలు విజయాలు సాధించిన ఆ తరువాత చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో డీలా పడిపోయాడు. అయితే ఈసారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో ఒక్కపుడు హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఆమె కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని కళ్యాణ్ రామ్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దానికి కారణం ఈ సినిమా స్టోరీ అని.. కధలో తన పాత్ర, విజయశాంతి పాత్ర చాలా బాగా వచ్చింది. జనాలు బాగా ఆ తల్లీకొడుకుల పాత్రలకు కనెక్ట్ అవుతారు అని అంటున్నాడు. ఈ సినిమా హిట్ అవుతుంది అని కళ్యాణ్ రామ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img