Homeహైదరాబాద్latest Newsకల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలో కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా 111 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1కోటి 11లక్షల 12 వేల 876 ఆర్థిక సహాయాన్ని మియాపూర్ లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిఅని, పేదింటి ఆడబిడ్డకు పెద్దన్న లాగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ , అన్వర్ షరీఫ్, గంగాధర్, ప్రసాద్, చంద్రిక ప్రసాద్ గౌడ్, సుప్రజ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img