ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలంలోని మేడిపల్లి,సత్తెక్కపల్లి, రాజేశ్వరరావు పెట్, చర్ల కొండాపూర్, బండలింగాపూర్, విట్టంపెట్, మెట్లచిట్టాపూర్ గ్రామాల్లో బుధవారం కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేశారు.మొత్తం అన్ని గ్రామాల్లో కలిపి ఇరవై తొమ్మిది లక్షల మూడువేల మూడు వందల అరవై నాలుగు రూపాయల విలువగల 29 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి గారు, మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు, బీఆర్ఏస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.