Homeహైదరాబాద్latest Newsరసవత్తరంగా కామారెడ్డి మున్సిపల్ ఎన్నిక

రసవత్తరంగా కామారెడ్డి మున్సిపల్ ఎన్నిక

కామారెడ్డిలో మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మొన్నటివరకూ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌కు దక్కుతుందని అందరూ భావించగా..ఒక్కసారిగా భాజపా రంగంలోకి దిగదంతో సందిగ్థత నెలకొంది. దీనికితోడు బీఆర్‌ఎస్ సైతం పోటీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో కామారెడ్డి మున్సిపల్‌లో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీకి సరిపడా బలం ఉన్నా..ఇద్దరు కౌన్సిలర్లు చైర్మన్ పదవి కోసం పోటీలో ఉన్నారు. వైస్ చైర్‌ పర్సన్ ఇందుప్రియతో పాటు కౌన్సిలర్ వనిత ఈ రేసులో ఉన్నారు. ఈ పోటీలో కౌన్సిలర్లు చీలిపోతే నష్టం వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్.. ముఖ్య నాయకులను క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా ఎన్నికల్లో తటస్థంగా ఉంటే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికోసం కాంగ్రెస్, భాజపా, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

Recent

- Advertisment -spot_img