ముంబయి: బాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌పై నటి కంగనా రనౌత్ ట్విట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్లో హీరోయిన్స్ గా రాణించాలంటే అంత సులువైన వ్యవహారం కాదన్నారు. బాలీవుడ్లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయన్నారు. హీరో ఎవరైనా సరే తన పక్కన నటించే హీరోయిన్ సొంత భార్యలా ప్రవర్తించాలని, చెప్పినట్లు పార్టీలకు, పబ్బులకు రావాలని ఆశిస్తారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాలు మారుతాయి.. హీరోలు మారుతారు.. కానీ హీరోయిన్ పరిస్థితి మాత్రం మొదటికే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాలంలో జయాబచ్చన్ వెనుక పవర్‌పుల్ బచ్చన్ ఉండటంతో ఆమే సురక్షితంగా ఉండొచ్చు.. కానీ ప్రవీణ్ బాబీ, జీనత్ అమన్‌లకు జరిగిన అన్యాయాన్ని తిరస్కరించకుండా ఉండలేమంటూ పేర్కొన్నారు.