It is known that the movie ‘Manikarnika’ (2019) starring Kangana Ranaut as the heroine was a huge success. Kangana Ranaut chose Rani Didda as the sequel to the film.
కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది సీనియర్ కథానాయిక కంగనారనౌత్.
తాజాగా ఆమె ఓ చారిత్రక చిత్రంలో వీరనారి పాత్రను పోషించడానికి సిద్ధమవుతోంది.
వివరాల్లోకి వెళితే…పదో శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన రాణీ దిద్దా వీరోచిత పోరాటగాథ ఆధారంగా ‘మణికర్ణిక రిటర్న్స్ : ది లెజెండ్ ఆఫ్ దిద్దా’ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కమల్‌జైన్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో కంగనారనౌత్ టైటిల్ రోల్‌ను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా చేపట్టబోతున్నది.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.
పోలియో వల్ల కలిగిన అంగవైకల్యంతో బాధపడుతూ కూడా తన శత్రువులపై వీరోచిత పోరాటం చేసిన పరాక్రమశీలిగా రాణి దిద్ద్దా కీర్తిని సంపాదించుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించబోతున్నారు.
కంగనారనౌత్ కథానాయికగా నటించిన ‘మణికర్ణిక’ (2019) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకు కొనసాగింపుగా కంగనా కశ్మీర్ రాణి దిద్దా కథాంశాన్ని ఎంచుకుంది.