బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ లోకసభ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
తనకు బీజేపీ సీటు ప్రకటించగానే కాంగ్రెస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఏ మాత్రం అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ అయితే హిందువుల్లోని ‘శక్తి’పై, మహిళలను గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.