మహా ప్రభుత్వానికి కంగనా సవాల్
ముంబాయి: ‘ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ కంగనా మహారాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగా సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదం పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోపక్క కంగనా తీరుపై సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
పోలికలతో దుమారం
ముంబాయిను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇష్టంలేకుంటే ముంబైకు రావాల్సిన అవసరంలేదని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కంగనా ఒక మెంటల్ పేషెంట్‌తో పోల్చారు. డు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావొద్దని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ముంబాయి రావొద్దని అన్నందుకు హోంమంత్రిని తాలిబన్‌లతో పోల్చుతూ వివాదాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు కంగనా. తాజా వివాదం వెనుక ఓ రాజకీయ పార్టీ అండ ఉందని శివసేన నేతలు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ అండదండలతోనే ఆమె ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరాఠాను కించపరిస్తే ఏమాత్రం సహించమని హెచ్చరిస్తున్నారు.
ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి
RELATED ARTICLES