సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. ‘కంగువ’ సినిమా ఎఫెక్ట్ సూర్య బాలీవుడ్ మూవీ ‘కర్ణ’ పై పడింది. ఈ సినిమా ఆగిపోయింది అని టాక్ నడుస్తుంది. అయితే సూర్య హీరోగా ‘కర్ణ’ అనే సినిమా బాలీవుడ్లో ప్లాన్ చేశారు. ఈ సినిమాని దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.మహాభారతంలోని కర్ణుడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించనున్నారు. ‘కంగువ’ సినిమా కూలెక్షన్ చూసి ‘కర్ణ’ నిర్మాతలు వెనక్కి అడుగు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.