తమిళ చిత్రసీమలో అగ్రనటుడు సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో దిశా పఠానీ కథానాయికగా నటించింది. ఈ సినిమా నవంబర్ 14న విడుదలైంది. ఎన్నో భారీ అంచనాలు మధ్య విదుదలైన ఈ సినిమా తొలి రోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిడివి ఎక్కువైందని, అందుకే అంత రన్‌టైమ్ అవసరం లేదని టాక్ వచ్చింది. దీంతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలోని 12 నిమిషాల సన్నివేశాలను ట్రిమ్ చేశారు. ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ నేటి నుంచి థియేటర్లలో విడుదల కానుంది. మరి ట్రిమ్ వెర్షన్ తో ఈ సినిమా కలెక్షన్స్ ఎంత రాబడుతుందో చూడాలి.