Homeహైదరాబాద్latest Newsమహిళా శిశు సంక్షేమం పై సమీక్ష నిర్వహించిన కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

మహిళా శిశు సంక్షేమం పై సమీక్ష నిర్వహించిన కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి

ఇదే నిజం, దేవరకొండ: మహిళా శిశు సంక్షేమం పై నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.గురువారం నల్లగొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదవ స్థాయి సంఘం సమావేశంలో నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి జడ్పీటిసి కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ సెంటర్ లో ప్రీ ప్రైమరీ పాఠశాలలకు ధీటుగా ఉండాలని ఆమె అన్నారు.అంగన్వాడీ భవనాలను ఆధునికరంగా సుందరంగా నిర్మించాలన్నారు. బాల‌ బాలికలకు గర్భిణీలకు,బాలింతలకు పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆమె అన్నారు.

గ్రామాలలో బ్రూణ హాత్యలు జరగకుండా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని అన్నారు.మహిళా బాల్య వివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోని గ్రామాలలో మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహాల మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.శిశు గృహలో ఉన్న శిశువులను ఆరోగ్యంగా ఉండేలా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు.బాల అమృతం సరైన సమయంలో ఇచ్చి వారి ఎదుగుదలకు అధికారులు సహాకరించాలని కోరారు.గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు.మ‌హిళ‌ల సంక్షేమ కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సి.ఇ.ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి , డి డబ్ల్యు సక్కుబాయి,జడ్పిటిసి ఇరుగు మంగమ్మ,ధనావత్ భారతి నాయక్,బుజ్జి,సి.డి.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img