Homeహైదరాబాద్latest NewsKannappa: కన్నప్ప కోసం అక్షయ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్ల..?

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్ల..?

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. కాగా కన్నప్పలో అక్షయ్ కుమార్ శివగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అక్షయ్ రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కన్నప్పలో కీలక పాత్రలో నటించనున్నారు. మోహన్‌లాల్ ఆదివాసీ తెగకు సంబంధించిన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అలాగే ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉండనున్నాయి. ఈ సినిమాలో పలువురు తారల పేర్లు కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img