Homeహైదరాబాద్latest NewsKannapa : కావాలనే ప్రభాస్ ''కన్నప్ప'' మూవీకి దూరంగా ఉన్నాడా..?

Kannapa : కావాలనే ప్రభాస్ ”కన్నప్ప” మూవీకి దూరంగా ఉన్నాడా..?

Kannapa : పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ఈ ఫాంటసీ సినిమా శివభక్తుడు కన్నప్ప లెజెండ్ ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ కావాలనే కనిపించడం లేదని అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా vfx, స్టోరీ అనుకున్నట్లు తీయలేదు అని అందుకే ఈ సినిమాపై ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసి, ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ, తన ఇమేజ్‌ను కాపాడుకోవాలని చూస్తున్నారనే పుకారు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా ‘కన్నప్ప’ చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. జూన్ 13, 2025న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ సినిమాలో ప్రభాస్ సుమారు 30 నిమిషాల పాటు కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రభాస్ హాజరు అవుతాడా లేదా అనే ప్రశ్న మొదలయింది. ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు. మరి ఈసారైనా ప్రభాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంటుకి వస్తాడో లేదు చూడాలి.

Recent

- Advertisment -spot_img