Homeహైదరాబాద్latest NewsKannappa : ''కన్నప్ప''.. కనబడుటలేదు.. మంచు విష్ణు ఎక్కడ..?

Kannappa : ”కన్నప్ప”.. కనబడుటలేదు.. మంచు విష్ణు ఎక్కడ..?

Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ”కనప్ప”. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ‘శివుడు’ పాత్రలో నటించారు. మొదటి నుండి ఈ సినిమా విజువల్స్ విషయంలో అంతగా లేవు అనే టాక్ ఉంది. కాగా ఈ సినిమా టీజర్ పై కొన్ని ప్రశంసలు వచ్చిన మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమా విజువల్స్ అనుకుంతా స్థాయిలో లేకపోవడంతో విష్ణు ”కన్నప్ప” మూవీని వాయిదా వేసాడు. ప్రస్తుతం సినిమా క్వాలిటీ బాగా రావడానికి మంచు విష్ణు కష్టపడుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాని జూన్ 27న విడుదల చేయనున్నట్లు మంచు మనోజ్ ప్రకటించాడు. మరోవైపు మంచు ఫ్యామిలీలో గొడవలు కారణంగానే ఈ సినిమాని విష్ణు వాయిదా వేసాడు అని నెటిజన్స్ అంటున్నారు. మంచు బ్రదర్స్ మనోజ్ – విష్ణు మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. అందుకే ఈ సమయంలో కన్నప్ప సినిమాని రిలీజ్ చేయకూడదు అని విష్ణు భావించాడు. ప్రస్తుతం మంచు విష్ణు సైలెంట్ అయిపోయాడు.

Recent

- Advertisment -spot_img