భారీ క్యాస్టింగ్​తో కాంతార చాప్టర్​1

0
724

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన మూవీ కాంతార. గతేడాది రిలీజైన ఈ కన్నడ సినిమా పాన్​ ఇండియా లెవెల్​లో అన్ని భాషల్లోకి డబ్ అయ్యి సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాంతార సినిమాతో ఓవర్​ నైట్ పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు రిషబ్ శెట్టి. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రిషబ్​ను తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు. అయితే, ప్రస్తుతం కాంతార మూవీకి ప్రీక్వెల్​గా కాంతార చాప్టర్​1ను రిషబ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్​గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తెలగు, తమిళ, కన్నడ, మలయాళ, బాలీవుడ్​ ఇండస్ట్రీలకు చెందిన 15 మంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్. అలానే మూవీ కోసం ఎంతో భారీ స్థాయిలో బడ్జెట్ కూడా ఖర్చు చేస్తున్నారట. మొత్తంగా గ్రాండియర్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 మూవీ తప్పకుండా రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుంటుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.