Kantara : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన సినిమా ”కాంతార” (Kantara). ఈ సినిమా 2022లో విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ”కాంతార: చాప్టర్ 1” రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అడివి ప్రాంతాల్లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ గవిగుడ్డ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అయితే సినిమా షూటింగ్‌కి గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ప్రభుత్వం అనుమతిచ్చింది, కానీ చిత్రబృందం సరిహద్దులు దాటి షూటింగ్ చేస్తున్నారు. అడవిలో చెట్లను నరికి షూటింగ్ చేయడం.. అలాగే పేలుడు పదార్ధాలు ఉపయోగించడంతో అక్కడి ఉన్న జంతవులు భయాందోళనకి గురవతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసే ప్రమాదముందని గ్రామస్థులు అన్నారు. అయితే ఈ విషయంలోనే గ్రామస్థులకు చిత్రబృందంకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆ గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తిపై చిత్ర యూనిట్ సభ్యులు దాడి చేసింది. దీంతో స్థానిక గ్రామస్థులంతా యెసలూరు పోలీస్ స్టేషన్ లో సినిమా చిత్రబృందంపై కేసు నమోదు చేశారు.ఈ విషయంలో న్యాయం జరగాలని, లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని గ్రామస్తులు చిత్ర యూనిట్‌ను హెచ్చరిస్తున్నారు.