Homeతెలంగాణkarimnagar:కరీంనగర్ తీగల వంతెన సేఫ్

karimnagar:కరీంనగర్ తీగల వంతెన సేఫ్

కరీంనగర్ తీగల వంతెన సేఫ్

  • ఆర్ అండ్ బీ అధికారుల క్లారిటీ..

ఇదేనిజం, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పాడైపోయిందని.. బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయని కొన్ని న్యూస్ ఛానల్స్‌తో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వందల కోట్ల రూపాయల వ్యయం చేసి నిర్మించిన ఈ బ్రిడ్జి మూనాళ్ల ముచ్చటగానే మిగిలిందంటూ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేశారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ వివరణ ఇచ్చింది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి ఎలాంటి నష్టం, హానీ జరగలేదని జిల్లా ఆర్ అండ్ బీ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ జీ సాంబశివరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా కరీంనగర్ వైపు ఉన్న అప్రోచ్ రోడ్డుపై చిన్నపాటి పగుళ్లు మాత్రం ఏర్పడ్డాయని చెప్పారు. సాధారణంగా ఏదైనా కొత్త బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మిస్తే.. మొదటిగా పడే వర్షాల కారణంగా రోడ్డు కోసం వాడిన గ్రావెల్.. నాచురల్ కంపక్షన్‌కు గురవుతుందని పేర్కొన్నారు. ఇలా గ్రావెల్ కంపెక్షన్ చెందడం వల్ల పలు చోట్ల రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పగుళ్లు ఏర్పడటం సాధారణమే అని తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img