Homeహైదరాబాద్latest Newsదళితులపై దాడులను అరికట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కర్క నాగరాజు

దళితులపై దాడులను అరికట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కర్క నాగరాజు

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం (ఎఐఎవైయస్) అధ్యక్షులు కర్క నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను సోమవారం కలిశారు. అనంతరం బషీర్ బాగ్ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణా రాష్ట్రం లో ఇటీవల దళితులు, గిరిజనులు మరియు ఆదివాసుల మీద దాడుల గురించి చైర్మన్ తో చర్చిండం జరిగిందన్నారు. వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ లో చెంచు మహిళ మీద దాడి, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో దళిత బాలుడి మీద దాడి పై వారితో మాట్లాడామన్నారు. రోజు రోజుకు దళిత, గిరిజన మహిళల పైన దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీతో ముందకు వెళుతుంటే ఇక్కడ మాత్రం అణగారిన వర్గాలకు చెందిన వారిపై దాడులు చేయడం శోచనీయమని, భవిష్యత్తులో మరల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం తరపున వారికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మణ్,అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి సదామహేష్, యస్.వినయ్ కుమార్, దినేష్ కుమార్, సప్పిడి భాస్కర్, కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img