Homeహైదరాబాద్latest Newsకర్మ చెప్పింది..! వడ్డీతో సహా తిరిగివస్తుందని.. నయనతార ఆసక్తికర పోస్ట్

కర్మ చెప్పింది..! వడ్డీతో సహా తిరిగివస్తుందని.. నయనతార ఆసక్తికర పోస్ట్

గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో హీరో ధనుష్, నయనతార మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. నయనతార 2022లో విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి వీడియో కొన్ని రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా ఫుటేజీని వాడినందుకు ఆ సినిమా నిర్మాత హీరో ధనుష్ నయనతారకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపించాడు. తాజాగా నయనతార సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో.. ‘కర్మ చెప్పింది!!.. అబద్ధాలతో ఎవరి జీవితాన్ని నాశనం చేస్తే.. దానిని మీరొక అప్పుగా భావించండి. ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి’ అని నయన్ చెప్పింది.

Recent

- Advertisment -spot_img