బెంగళూరు: కరోనా సంక్షోభం నేపథ్యంలో శాసనసభ్యుల జీతభత్యాల్లో 30 శాతం తగ్గిస్తూ కర్ణాటక అసెంబ్లీ తీర్మానించింది. ఈ మేరకు సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ల జీత, భత్యాలను 30 శాతం తగ్గించుకోవడం వల్ల 18 కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చని కర్ణాటక శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు.