Karnataka CM:
కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు సిద్ధం అయ్యారు. జూలై 1 వ తేదీ నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందచేస్తామని ప్రకటించారు. శుక్రవారం కాబినెట్ సమావేశం అనంతరం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఐదు ముఖ్యమైన హామీలను నెరవేర్చుతున్నట్లు ప్రకటించారు. .జూలై 1 వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ తో పాటు అన్న భాగ్య పథకం కింద పేదవారికి నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు మాత్రమే అందించిందని ప్రకటించారు. జూన్ 11 వ తేదీ నుంచి మహిళలకు కర్ణాటక ఏసీ బస్సులు మినహా ప్రజా రవాణా వ్యవస్థలో ఉచిత ప్రయాణం సౌకర్యం అందిస్తామని ప్రకటించారు. గృహలక్మి పథకం ద్వారా కుటుంబంలో పెద్దదైన మహిళకు నెలకు రూ. 2 వేలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. .ఈ స్కీం ను ఆగష్టు 15 వ తేదీ నుంచి ప్రారంభిస్తానని వెల్లడించారు. ఈ సంవత్సరం పాసైన గ్రాడ్యు వేట్లకు నెలకి రూ 3 వేలు అందిస్తామని ప్రకటించారు. డిప్లొమా అభ్యర్థులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ. 1500 అందిస్తామని ,ఇలా రెండు సంవత్సరాల వరకు ఇస్తామని తెలిపారు