తప్పించాలని స్వపక్షంలో పెరుగుతున్న డిమాండ్
బెంగళూరు: కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పకు పదవి గండం ఏర్పడింది. ఆయనపై పీకలలోతు అసంతృప్తి ఉన్న స్వపక్షంలోని సీనియర్లు ఇప్పుడు అదను చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. యడియూరప్పకు ఇటీవల 75 ఏండ్లు నిండాయి. దాంతో బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్య పదువుల్లో కొనసాగేందుకు వీలు లేదని ఆయన ప్రత్యర్థులు కత్తులు దూస్తున్నారు. ఆయన తర్వాత సీఎం పోస్టును ఎక్కేందుకు పార్టీలో సీనియర్లు, మాజీ సీఎంలు కాచుకోని కూర్చున్నారు. ఇటీవల మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి జగదీశ్ శెట్టర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అక్కడ పార్టీ సీనియర్లతో జరిగిన చర్చలన్నీ సీఎం పోస్టు చుట్టే జరిగినట్లు పార్టీలో వారే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక ఆలస్యం చేస్తే తన పదవికి గండం తప్పదని గ్రహించిన సీఎం యడియూరప్ప ఈ నెల 17 హస్తీనకు బయలు దేరి వెళుతున్నారు. పైకి వరద సాయం, కేబినెట్ విస్తరణ అంటున్నా తన పదవీని కాపాడుకోవడంపైనే ఆయన దృష్టి పెడతారనడంలో సందేహం అసలు అవసరం లేదు.
కర్ణాటక సీఎం మెడపై వేలాడుతున్న సీనియర్ల కత్తి
RELATED ARTICLES