– షబ్బీర్ అలీ ఫామ్ హౌస్ లో మకాం
– అక్కడి నుంచే ప్రలోబాలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం స్థానికేతర నేతలు నియోజకవర్గాలు విడిచిపెట్టాల్సి ఉండగా.. కర్ణాటకకు చెందిన ఓ లీడర్ మాత్రం కామారెడ్డిలోనే ఉండిపోయారు. అక్కడి నుంచే ప్రలోబాలకు తెరలేపారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండొద్దని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. కామారెడ్డి నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం వద్ద ఉన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫామ్ హౌస్‌లో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఉండిపోయారు. నాన్ లోకల్ వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లీడర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.