karnataka elections: కర్ణాటక ఓటరు కాంగ్రెస్‌కే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తేల్చిచెప్పాయి. 224 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 113 కాగా.. ఎగ్జిట్ పోల్స్ లెక్కలు చూస్తే కాంగ్రె్‌సకు సగటున 115-130 సీట్ల వరకు సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీకి సగటున 80-90 సీట్లు, జేడీఎ్‌సకు 15-20 సీట్లు రావచ్చని అంచనా వేశాయి. మొత్తం 12 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించగా.. ఇందులో 10 కాంగ్రె్‌సకు, రెండు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయితే చాలా సంస్థల అంచనాలను పరిశీలిస్తే హంగ్ సభ ఏర్పడే అవకాశాలను కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ హంగ్ ఏర్పడితే ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్ మరోమారు కింగ్ మేకర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ పరిస్థితి రాదని.. సొంతంగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. సీఎం బసవరాజ్ బొమ్మై మాత్రం ఈ సర్వేలను తోసిపుచ్చారు.తమకు క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం.. సంపూర్ణ మెజారిటీతో గెలుస్తామని స్పష్టం చేశారు.
హంగ్ కూడా అవకాశం
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 సీట్లు అవసరం కాగా.. ప్రధాన సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రె్‌సకు 106కుపైగా ఖాయమని స్పష్టమవుతోంది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్, టైమ్స్ నౌ-ఈటీజీ, జీన్యూ్‌స-మాట్రైజ్, న్యూస్ 24-టుడేస్ చాణక్య, పీపుల్స్ పల్స్, ఆత్మసాక్షి సంస్థలు.. కాంగ్రె్‌సకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వస్తుందని పేర్కొన్నాయి. వీటిలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ.. కాంగ్రెస్ గరిష్ఠంగా 140 సీట్లు సాధిస్తుందని తేల్చింది. ఆత్మసాక్షి గ్రూప్ కూడా ఆ పార్టీకి గరిష్ఠంగా 124 సీట్లు వస్తాయని పేర్కొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 100లోపు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. సువర్ణ న్యూస్-జన్ కీ బాత్, న్యూస్ నేషన్-సీజీఎ్‌స మాత్రమే బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టీవీ9 భారత్‌వర్ష్ – పోల్‌స్ట్రాట్, రిపబ్లిక్ టీవీ – పీ మార్క్, ఏబీపీ న్యూస్-సీ ఓటర్ వంటి సంస్థలు కాంగ్రె్‌సకు అత్యధిక స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
కర్ణాటక ఎన్నికల్లో ప్రాంతాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడించింది. పాతమైసూరు, హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటక, బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక ప్రాంతాలు కాంగ్రె్‌సకు జై కొట్టగా, కోస్తా ప్రాంతంలో మాత్రమే బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని పేర్కొంది. జేడీఎ్‌సకు కంచుకోట లాంటి పాత మైసూరు ప్రాంతంలోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, అక్కడ జేడీఎస్ రెండో స్థానానికి పరిమితమవుతుందని తెలిపింది.
పాత మైసూరు ప్రాంతంలో 64 నియోజకవర్గాలు ఉండగా, కాంగ్రెస్ 36 సీట్లు (40% ఓట్లు) గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక్కడ జేడీఎ్‌సకు 18 సీట్లు(28% ఓట్లు), బీజేపీకి 6 సీట్లు (25% ఓట్లు), ఇతర పార్టీలకు 4 సీట్లు(7% ఓట్లు) లభిస్తాయని పేర్కొంది. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో 40 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 32 సీట్లు(47% ఓట్లు) కాంగ్రెస్, ఏడు సీట్లు(36% ఓట్లు) బీజేపీ, ఒక్క సీటు(13% ఓట్లు) జేడీఎస్.. ఇతర పార్టీలు 4% ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. ముంబై-కర్ణాటక ప్రాంతం లో 50 నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్ 28 సీట్లు (45%ఓట్లు), బీజేపీ 21 (42% ఓట్లు), జేడీఎస్ ఒక స్థానం (8% ఓట్లు) దక్కించుకుంటాయని తెలిపింది. బెంగళూరు ప్రాంతంలో 28 నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్ 17 (44%ఓట్లు), బీజేపీ 10 (40% ఓట్లు), జేడీఎస్ 1 (15% ఓట్లు) గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. సెంట్రల్ కర్ణాటకలో 23 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 12 (41% ఓట్లు), బీజేపీ 10 (35% ఓట్లు), జేడీఎస్ 1 (17% ఓట్లు) సాధిస్తాయని పేర్కొంది. కర్ణాటక కోస్తా ప్రాంతంలో 19 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ 50% ఓట్లతో 16 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రె్‌సకు మూడు సీట్లు(40% ఓట్లు) రావచ్చని తెలిపింది.