కార్తీక పౌర్ణమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరిచెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేశారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంభ దేవీకి భక్తులు అభిషేకాలు, కుంకుమార్చన పూజలు జరిపారు.