HomeరాజకీయాలుKasani : ఈటల ముదిరాజ్​లను ఎదగనివ్వడు

Kasani : ఈటల ముదిరాజ్​లను ఎదగనివ్వడు

– ముఖ్యమంత్రి కేసీఆర్​
– ముదిరాజ్​ల అభివృద్ధికి బీఆర్ఎస్​ కృషి చేస్తుంది
– సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కాసాని జ్ఞానేశ్వర్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్​ ముదిరాజ్​ సామాజిక వర్గాన్ని ఎదగనివ్వలేదని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ముదిరాజ్​ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్​ శుక్రవారం సీఎం కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్​ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన బండా ప్ర‌కాశ్‌ను ఎంపీ చేసుకున్నామని, ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ చేసుకున్నామని, ఇప్పుడు మండ‌లి వైస్ చైర్మ‌న్‌గా నియ‌మించుకున్నామన్నారు. ‘ముదిరాజ్​లకు రాజ‌కీయాలు తెలుసు, మ‌న‌కున్న‌వి మొత్తం 119 సీట్లు.. అందులో ఏడు మ‌న‌వి కావు. మ‌న‌కున్న‌ది కేవ‌లం 112 సీట్లు. ఆ సీట్ల‌లో పెట్టిన వ్య‌క్తి ప‌క్కా గెల‌వాలి. ఏదో త‌మాషాకు అభ్య‌ర్థిని బ‌రిలో దింపి, ఆ సీటును కోల్పోయి, పార్టీకి న‌ష్టం చేకూర్చోవ‌డం రాజ‌కీయం కాదు. ఎన్నిక‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో అంద‌రం క‌లిసి కూర్చుందాం. ఎన్టీ రామారావు పీరియ‌డ్‌లో లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్‌లో బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని డిమాండ్ చేసి సాధించాం. దాంతో కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు ఎదిగారు. రాజ‌కీయంగా రాబోయే రోజుల్లో చాలా ప‌ద‌వులు ఉంటాయి. చాలా అవ‌కాశాలు ఉంటాయి. ముదిరాజ్ సామాజిక వ‌ర్గం పెద్ద‌ది కాబ‌ట్టి ఆ వ‌ర్గం నుంచి మ‌నం నాయకుల‌ను త‌యారు చేసుకోవాలి. బీఆర్ఎస్​ నుంచి ఈటల రాజేందర్​ వెళ్లిపోయినా.. కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్​ పార్టీలో చేర‌డం మంచి ప‌రిణామం’ అని సీఎం కేసీఆర్​ అన్నారు

Recent

- Advertisment -spot_img