Homeరాజకీయాలుకాంగ్రెస్​లో ‘కాటా’ చిచ్చు

కాంగ్రెస్​లో ‘కాటా’ చిచ్చు

– టికెట్​ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం
– రేవంత్​ ఫ్లెక్సీలు దహనం చేసిన అనుచరులు
– టికెట్​ అమ్ముకున్నారంటూ ఆగ్రహం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ థర్డ్​ లిస్ట్​పై కూడా చిచ్చు రేగింది. పటాన్​ చెరు టికెట్ దక్కకపోవడంతో కాటా శ్రీనివాసగౌడ్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పార్టీలో ఉన్న తనకు కాకుండా.. కొత్తగా వచ్చిన వాళ్లకు టికెట్​ ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పటాన్​ చెరు కాంగ్రెస్ టికెట్ ను ఇటీవల చేరిన నీలం మధు ముదిరాజ్​కు కాంగ్రెస్​ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కాటా అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పటాన్ చెరులో ఏర్పాటు చేసిన రేవంత్​ రెడ్డి ఫ్లెక్సీని కాటా అనుచరులు దహనం చేశారు. రేవంత్​ డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తన అనుచరుడికి టికెట్​ దక్కకపోవడంతో దామోదర రాజనర్సింహ కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాటా శ్రీనివాస్​ గౌడ్​ కు టికెట్ ఇప్పించేందుకు దామోదర రాజనర్సింహ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయినప్పటికీ అధిష్ఠానం ఆయన ప్రతిపాదనను పక్కకు పెట్టింది. దీంతో దామోదర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేవంత్​ రెడ్డిని ఇంటి ముందు ఆందోళన నిర్వహించేందుకు కాటా అనుచరులు సన్నద్ధమయ్యారు.

Recent

- Advertisment -spot_img