Homeహైదరాబాద్latest Newsసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ రవీందర్ రావు ను హెచ్చరించిన కత్తి స్వామి

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ రవీందర్ రావు ను హెచ్చరించిన కత్తి స్వామి

ఇదే నిజం, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో, సీఎం ఇనుముల రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఎమ్మెల్సీ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి హెచ్చరించారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు మీ స్థాయి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కాదన్నారు. నువ్వు ఒక గల్లీ లీడర్ వై ఉండి సీఎంను విమర్శిస్తావా! తెలంగాణ ఉద్యమం పేరుతో మహబూబాబాద్ లో నువ్వు చేయని దందా లేదు. విద్యా సంస్థల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకొని వ్యాపారం చేసావు. ఇంకొక సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. తగిన గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి చల్ల నిర్మల వెంకట్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు కోరే కుమారస్వామి, కన్నబోయిన వెంకన్న, మాజీ సర్పంచ్ కట్ల భవాని విష్ణు, మాజీ ఎంపిటిసి బోడ భాస్కర్, మాజీ వార్డు సభ్యుడు హెచ్. శివ, శ్రీనివాస్, బందెల అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img