ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, దివంగత నేత కటికనేని లక్ష్మణ్ రావు 80వ జయంతి సందర్భంగా అంగడిపేట క్రాస్ రోడ్ వద్ద లక్ష్మణ్ రావు విగ్రహాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” లక్ష్మణ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా నీళ్లు మక్కావాలి అని కృష్ణా జల సాధన ఉద్యమాన్ని నడిపించారని తెలిపారు. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అలాగే వివిధ హోదాలో పని చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. ఆయన ఎప్పుడూ కలిసిన ప్రజల సమస్యల గురించే వివరించేవారని ఆయన తెలిపారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు మనలో సజీవంగా బ్రతికే ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటి రెడ్డి , మాజీ ఎమ్మెల్యే చందర్ రావు , ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి ,పాల్వాయి వెంకటేశ్వర్లు , జానీ యాదవ్ , యాదగిరి రావు , దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా , స్థానిక ప్రజాప్రతినిధులు , బంధువులు , కుటుంబ సభ్యులు , దుస్సర్ల సత్యనారాయణ , దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు.