కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లారు. జైలు నుంచి వచ్చిన ఆమె తన తండ్రిని కలవనున్నారు. పది రోజుల పాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. ఆ తర్వాత కార్యకర్తలకు అందుబాటులోకి వస్తానని ప్రకటించారు. అంత వరకూ అందరూ తనకు సహకరించాలని కోరారు. కాగా, లిక్కర్ స్కాంను ఎదుర్కొనే అంశాలపై కేసీఆర్, న్యాయ నిపుణులతో సమాలోచనలు చేయనున్నారని సమాచారం.