Homeహైదరాబాద్latest Newsకవిత బెయిల్ కహాని.. మళ్లీ అదే పొడిగింపు.. ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించట్లేదు..!

కవిత బెయిల్ కహాని.. మళ్లీ అదే పొడిగింపు.. ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించట్లేదు..!

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్​ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. జూలై 31తో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్ గా ఈడీ అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్ రిమాండ్​ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్​ పిటిషన్లను తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున కవిత రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్​ను 14 రోజుల పాటు పొడిగిస్తూ తీర్పిచ్చింది.

లిక్కర్​ పాలసీలో సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత ఏ17 గా ఉన్నారు. సీబీఐ ఈ ఛార్జ్ షీట్ పై మరోసారి విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేసింది. ఒక వైపు ఈడీ, సీబీఐ మూకుమ్మడి దాడులు, మరో వైపు బెయిల్​ దొరక్కపోవడంతో కవిత తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఆమె ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు రావడంతో కవిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసులో కవిత మార్చి 16న అరెస్ట్ కాగా.. నాలుగు నెలల నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు.

Recent

- Advertisment -spot_img