– రాజకీయ కక్షసాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటాను
– ఎమ్మెల్సీ కవిత
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో తాను కూడా బాధితురాలినేని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే తాను ఎదుర్కొంటానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని కవిత ఎమ్మెల్సీ అన్నారు. గురువారం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్ స్కామ్‌లో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చారని భాజపాను ఉద్దేశించి విమర్శించారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగానూ ప్రకటిస్తారేమోనని కవిత వ్యాఖ్యానించారు.