Kavitha MLC:కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పావులు కదుపుతున్నది . రాజకీయ శత్రువులను దారికి తెచ్చుకునేందుకు అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను వాడుతున్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ను లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేసి.. తమను వ్యతిరేకిస్తే ఎంతటి వారినైనా వదలబోమని కేంద్రం సంకేతాలు ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారింది . పిళ్ళై కి సంబందించిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు పేర్కొనడం ,కవిత బినామీ రామచంద్ర పిళ్లై అని పేర్కొనడం వంటి విషయాలు ఎమ్మెల్సీ కవిత(kavitha) అరెస్ట్ కాక తప్పదనే ప్రచారం జరుగుతున్నది.
రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. పిళ్లైకి సంబంధించిన ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. రామచంద్ర పిళ్లై సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత (kavitha) బినామీగా ఉన్నారని , ఆమె ప్రయోజనాల కోసం రామచంద్రి పిళ్లై పనిచేశారని రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైకి సంబంధించి 17 పేజీలతో రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేసింది ఈడీ.. తాను కవిత బినామీ అని విచారణలో రామచంద్రపిళ్లై అంగీకరించారని కూడా పేర్కొన్నారు. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్‌కు పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి , నగదు బదిలీకి సంబంధించి ఆయన్ను లోతుగా విచారించాల్పిన అవసరం ఉందని ఈడీ వాదించడంతో ఈనెల 13వ తేదీ వరకు కస్టడీకి అప్పగించారు.
సౌత్‌గ్రూప్ రూ.100 కోట్లు పెట్టుబడి
సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత(kavitha), అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్‌రెడ్డితోపాటు వైసీపీ ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. సౌత్‌గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారని , కవిత(kavitha) కు లబ్ధి కోసం ఆరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఆప్ నేతలకు , సౌత్ గ్రూప్ సభ్యలుకు మధ్య పిళ్లై మధ్యవర్తిగా పనిచేశారని కూడా ఈడీ పేర్కొంది. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పిళ్లై దర్యాప్తులో అంగీకరించారని , సౌత్‌గ్రూప్ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించిందని కూడా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాన్ని పేర్కొంది.
బినామీ గా ఉన్నానని ఒప్పుకున్నట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్
ఢిల్లీ లిక్కర్ పాలసీలో రామచంద్ర పిళ్లై కీలకపాత్ర పోషించాడని , 12శాతం లాభం చేకూర్చడంలోనూ ఆయన పాత్ర ఉందని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది. 12శాతం లాభంగా రూ.420కోట్లు వస్తే అంతా పంచుకున్నారని పేర్కొంది.లిక్కర్‌స్కామ్‌లో సోమవారం రామచంద్ర పిళ్లైని ఈడీ అదుపు లోకి తీసుకుంది. రామచంద్ర పిళ్లై విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని , ప్రతిరోజు 2 గంటల పాటు కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి. తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు కూడా పిళ్ళైకి అవకాశం కల్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.