దిల్లీ : ఎమ్మెల్సీ కవిత కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిసాయి. కోర్టు మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగింపుకు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయంలో డేటా డిలీట్ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఎన్నికల్లో లబ్ధి కోసమే అరెస్టు చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా పోరాడతామన్నారు.