Homeహైదరాబాద్latest NewsKavitha : పింక్‌ బుక్‌లో పేర్లు రాస్తున్నాం.. ఎవర్నీ వదలం.. కవిత వార్నింగ్..!!

Kavitha : పింక్‌ బుక్‌లో పేర్లు రాస్తున్నాం.. ఎవర్నీ వదలం.. కవిత వార్నింగ్..!!

Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్న అధికారులకు, కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. తాను మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచి వ్యక్తిని కాదని, మనదంతా రౌడీ టైప్ అని అన్నారు. బాన్సువాడలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను సతాయించి పోలీస్ స్టేషన్‌లో పెట్టినవాళ్లను వదిలిపెట్టను అని అన్నారు. ఎవరు బెదిరిస్తున్నారో పేర్లు ను పింక్ బుక్‌లో రాస్తున్నాం అని హెచ్చరించారు. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరైన సరే.. బీర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని కవిత వార్నింగ్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img