– లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
– సర్కారును వాళ్లు పడగొట్టే పనిలో ఉంటే..నేను నిలబెట్టే పనిలో ఉంటా
– కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్ ఎందుకు స్పందించట్లే?
– ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇదే నిజం, ఏపీ బ్యూరో: కవిత(Kavita) అరెస్ట్ ఓ డ్రామా అని, లిక్కర్ స్కామ్(Liquor Scam) కేసులో బీఆర్ఎస్ , బీజేపీ డ్రామాలు మొదలు పెట్టాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న భారీ బహిరంగా కోసం అక్కడికి చేరుకున్న రేవంత్ రెడ్డి.. మీడియా సమావేశంలో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి కేసీఆర్,మోడీ కలిసి నాటాకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే పని వాళ్లు చేస్తే.. దాని నిలబట్టే పనిలో తాను ఉంటానని తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుటుంబం, బీజేపీ ఆడుతున్న డ్రామా డైలీ సీరియల్‌ను గుర్తు చేస్తోందన్నారు. కవిత అరెస్ట్‌తో ఈ డ్రామా పతాకస్థాయికి చేరిందన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఎన్నికలకు ముందు మోడీ ,కేసీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వస్తున్నారని చెప్పారు.