Homeతెలంగాణkcr:కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్

kcr:కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్

కొల్హాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్

  • మహాలక్ష్మి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు

ఇదేనిజం, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్, దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొల్హాపూర్ నుంచి నేరుగా మ‌హాలక్ష్మీ అమ్మ‌వారి దేవాల‌యానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వేద పండితులు కేసీఆర్‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. మ‌రికాసేప‌ట్లో సాంగ్లి జిల్లాలోని వాటేగావ్‌ గ్రామానికి చేరుకుంటారు. మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు.

Recent

- Advertisment -spot_img