Homeతెలంగాణponguleti srinivas reddy:అభద్రతా భావంలో కేసీఆర్

ponguleti srinivas reddy:అభద్రతా భావంలో కేసీఆర్

  • ఓట్ల కోసమే ఆర్టీసీ విలీనం
  • కాంగ్రెస్​ నేత పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
    ఇదేనిజం, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అభద్రతాభావంతో మాట్లాడారని, ప్రభుత్వం చేజారుతుందనే ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతుల రుణ మాఫీ అంటూ ఎన్నికల కోసమే హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, ముత్యాలగూడంలో మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత హామీలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ హయాంలో వైస్ రాజశేఖర రెడ్డి అడిగిన వారికల్లా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కాళ్లు.. అరిగేలా తిరిగినా చాలా మందికి ఇవ్వలేదని, ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఎన్నికల కోసమేనని పొంగులేటి విమర్శించారు. రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేస్తుందన్నారు. అధికారం ఉందని అక్రమ కేసులు పెడతే చూస్తూ ఊరుకోమన్నారు. పోలీసులు చేతిలో ఉన్నారని అర్థరాత్రి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం మంచిది కాదని, అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు కర్రు కాసి వాత పెట్టడం ఖాయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img